News February 22, 2025

ఆయిల్‌పామ్ తోటలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల అబ్బాపూర్ గ్రామంలో ఆయిల్‌పామ్ తోటలను అధికారులతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఉపయోగాలను అధికారులకు సూచించి, రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్ పరిశ్రమ నిర్మాణ పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రఘు వరుణ్, ఎమ్మార్వో, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

‘ఆర్‌జీ-3 ఏరియాలో నవంబర్‌లో 72% బొగ్గు ఉత్పత్తి’

image

RG-3 ఏరియాలో NOV నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలు GM నరేంద్ర సుధాకరరావు వెల్లడించారు. 5.70 లక్షల టన్నుల లక్ష్యానికి 4.09 లక్షల టన్నులు (72%) ఉత్పత్తిచేశారు. ఓబీ వెలికితీతలో షవెల్స్ విభాగం 12.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 13.11 లక్షల క్యూబిక్ మీటర్లు (105%) సాధించింది. బొగ్గు రవాణా 5.18 లక్షల టన్నులు నమోదైంది. OCP-1 38%, OCP-2 116% ఉత్పత్తి సాధించాయి. లక్ష్య సాధనకు భద్రతతో పని చేయాలన్నారు.

News December 1, 2025

సిద్దిపేట: AIDS గురించి పిల్లలకు తెలియజేయాలి: జడ్జి

image

HIV/AIDS గురించి తల్లి దండ్రులు పిల్లలకు తెలియజేయాలని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ సూచించారు. ఎయిడ్స్ ప్రివెన్షన్ డే సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ వ్యాధి గురించి ఎవరికి తెలిసేది కాదన్నారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలాన్నారు.

News December 1, 2025

వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ కావ్య ప్రశ్న

image

బలహీన వర్గాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ కడియం కావ్య పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరారు. వరంగల్‌లో నైపుణ్యాభివృద్ధి పథకాల అమలు, లోపాలపై ఆమె పార్లమెంట్‌లో ప్రశ్నించారు. పీఎంకేవీవై ప్రారంభం నుంచి ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అమలులో ఉన్న 4.0లో ఒక్క కేంద్రం కూడా పనిచేయకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.