News September 13, 2024
ఆయుధాగారాన్ని తనిఖీ చేసిన ఎస్పీ గంగాధర్

ఎస్పీ ఆర్. గంగాధర్ శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయుధాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా ఆయన అక్కడి ఆయుధాలను స్వయంగా పరిశీలించారు. ఆర్మోరర్ వర్క్ షాప్, యాంటీ రోయిట్ సామాగ్రి, మందు గుండు సామాగ్రి యొక్క నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించిన ఎస్పీ.. ఆయుధాగార నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు.
Similar News
News January 4, 2026
గన్నవరంలో రేపు సబ్‌స్టేషన్ ప్రారంభం.. మంత్రుల రాక

AP ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 132/33 KV గన్నవరం విమానాశ్రయ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం ప్రారంభించనున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోటును అధిగమించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు వాసంశెట్టి, కొల్లు, గన్నవరం MLA యార్లగడ్డ పాల్గొననున్నారు.
News January 4, 2026
కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ‘శ్రీరామ్మూర్తి’

కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు అందే శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్మూర్తి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.