News November 22, 2024
ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోండి: ఎస్పీ
ఆయుధాల పనితీరుపై పోలీస్ సిబ్బంది పరిజ్ఞానం పెంచుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు శివారులోని జగన్నాథ గట్టు సమీపంలో పోలీస్ సిబ్బందికి నిర్వహిస్తున్న ఫైరింగ్ శిక్షణను పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఆయుధాల పరిజ్ఞానంపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఆయుధ నైపుణ్యాన్ని పరిశీలించారు.
Similar News
News December 2, 2024
ప్రేమ పేరుతో మోసం.. ఆదోనిలో ప్రియుడి కుటుంబంపై కేసు
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఆదోనిలో కేసు నమోదైంది. సీఐ శ్రీరామ్ వివరాల మేరకు.. ఆదోనికి చెందిన గురుప్రసాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మైసూరు యువతి చందన పరిచయమైంది. ఇరువురూ ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
News December 1, 2024
గోనెగండ్ల: చీరకు నిప్పు.. చికిత్స పొందుతూ మహిళ మృతి
గోనెగండ్లకు చెందిన సుంకులమ్మ (81) అనే మహిళ కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిందని సీఐ గంగాధర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. ఎస్సీ కాలనీలో ఉండే సుంకులమ్మ నవంబర్ 28న వేడి నీళ్ల కోసం పొయ్యి దగ్గరకు వెళ్లగా చీరకు నిప్పు అంటుకొని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసామన్నారు.
News December 1, 2024
సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి: కలెక్టర్
నంద్యాల జిల్లాలో డిసెంబర్ 8న ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందని తెలిపారు.