News February 12, 2026
‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.
Similar News
News March 16, 2026
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి వరుసగా భృంగి, కైలాస, నంది, అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, నిజరూప అలంకారాల్లో దర్శనమిస్తారు. ఈ 5 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
News March 16, 2026
భారత్‌కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.
News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్‌ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.


