News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్‌సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News April 25, 2025
ప్రాతః కాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

నేడు శుక్రవారం సందర్భంగా ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు ప్రాతః కాల విశేష దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందచేశారు.
News April 25, 2025
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం ఆర్మూర్‌లో 45.4, ముగ్పాల్ 45.3, ముప్కాల్, ఎడపల్లి, ఏర్గట్ల 45.1, మెండోరా, నిజామాబాద్ పట్టణం, కమ్మర్పల్లి, మోస్రా 45.0, ధర్పల్లి, కోటగిరి 44.9, ఆలూర్ 44.8, నందిపేట, నిజామాబాద్ రూరల్, సిరికొండ 44.7, మోర్తాడ్ 44.6, తుంపల్లి 44.5, మక్లూర్ 44.4, బోధన్, జనకంపేట, రెంజల్ 44.2, డొంకేశ్వర్, బాల్కొండ 44.1, సాలూరా 44, భీంగల్లో 43.9℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News April 25, 2025
సత్తెనపల్లి: పుట్టిన రోజే అనంతలోకాలకు

సత్తెనపల్లి (M) రెంటపాళ్లలో నిన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు.. మృతుడు మహేశ్ ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పుట్టిన రోజు కావడంతో విధులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తుండగా DDపాలెం రోడ్డులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో మహేశ్ స్పాట్‌లోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.