News June 1, 2024
ఆరా సర్వే..గుడివాడ అమర్నాథ్ ఓటమి
జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ప్రకారం గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని తెలిపింది. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుస్తారని అంచనా వేసింది.
Similar News
News September 11, 2024
తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రద్దు
ఈస్ట్ కోస్ట్ డివిజన్‌లోని పలు ప్రత్యేక రైళ్లును రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తిరుపతి – శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను, అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు – తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వెల్లడించారు.
News September 11, 2024
విశాఖ: సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్
ఉమ్మడి విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
News September 11, 2024
విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలు బదిలీ
విశాఖ రేంజ్ పరిధిలో 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. మాకవరపాలెం ఎస్సై టీ.రామకృష్ణారావును రోలుగుంట పోలీసు స్టేషన్‌కు, కే.కోటపాడు ఎస్సై లక్ష్మీనారాయణను ఏ.కోడూరు, రావికమతం ఎస్సై ధనుంజయ్ నాయుడును అనకాపల్లి వీఆర్‌కు, ఏ.కోడూరు ఎస్సై రమేశ్‌ను అనకాపల్లి వీఆర్‌కు, కొత్తకోట ఎస్సై లక్ష్మణరావును కశింకోటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.