News September 12, 2024

ఆరుగురు డాక్టర్లతో ఆదిమూలం బాధితురాలికి పరీక్షలు

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలకి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులతో పరీక్షలు చేశారు. ఎక్స్‌రే తీశారు. రక్త, వీడిఆర్ఎల్ పరీక్షలు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలను రెండు సార్లు వాయిదా వేసినా.. మూడోసారి బాధితురాలు పరీక్షలకు హాజరయ్యారు.

Similar News

News January 10, 2026

సూళ్లూరుపేట: పక్షుల పండుగ.. నేటి కార్యక్రమాలు

image

ఉ. 9 గంటలు: S.పేట హోలీక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30- 12 : పక్షుల పండుగ, స్టాళ్ల ప్రారంభం
సా.5 : సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగో‌పై పాటకు డాన్స్, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, పులికాట్ సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన, లైటింగ్ ల్యాంప్
సా.6.30కి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
సా.7గంటలకు అతిథుల ప్రసంగాలు
సా.7.30-10 గంటల వరకు పాటకచ్చేరి, డాన్స్

News January 10, 2026

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని ఒకరి స్పాట్ డెడ్

image

బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. శుక్రవారం రాత్రి బలిజపల్లి సమీపంలో గల ఫ్లైఓవర్ వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని హాస్పిటల్‌కి తరలించారు.

News January 10, 2026

చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

image

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్‌స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.