News September 12, 2024
ఆరుగురు డాక్టర్లతో ఆదిమూలం బాధితురాలికి పరీక్షలు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలకి తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులతో పరీక్షలు చేశారు. ఎక్స్‌రే తీశారు. రక్త, వీడిఆర్ఎల్ పరీక్షలు చేసి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మెటర్నిటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలను రెండు సార్లు వాయిదా వేసినా.. మూడోసారి బాధితురాలు పరీక్షలకు హాజరయ్యారు.
Similar News
News October 7, 2024
తిరుపతిలో 10న జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 10వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృధి శాఖ అధికారి లోకనాదం పేర్కొన్నారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమాతోపాటూ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News October 7, 2024
చిత్తూరు: 405 పంచాయతీ సెక్రటరీల బదిలీల
చిత్తూరు జిల్లాలో ఆదివారం భారీగా సాధారణ బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ శాఖలోని DPO పరిధిలో 405 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 వరకు 202 మంది, గ్రేడ్-5 కింద 152 మంది, ఈవోపీఆర్డీలు ఏడుగురు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6(డిజిటల్ అసిస్టెంట్) 44 మంది బదిలీ అయ్యారు.
News October 7, 2024
శ్రీవారి గరుడసేవకు విస్తృతమైన ఏర్పాట్లు : టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.