News February 7, 2026
ఆరోగ్యంగా ఉంటేనే విధుల్లో రాణించగలరు: ఎస్పీ

పోలీసులకు విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్య పరిరక్షణ, క్రమశిక్షణ, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వీక్లీ పరేడ్‌లో మాట్లాడారు. సిబ్బంది సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలన్నారు. ఫిట్నెస్‌తోనే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని, మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
Similar News
News March 17, 2026
నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేటి పర్యటన వివరాలు ఖరారయ్యాయి. ఉదయం 11 గంటలకు ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) పనితీరుపై అధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.
News March 17, 2026
రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

TG: డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో BRS షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీకి చెందినవారు అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వంటి వాటితో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని BRS పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.
News March 17, 2026
GNT: నేడు మాస్టర్ ఇ.కె వర్ధంతి

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, రచయిత ఎక్కిరాల కృష్ణమాచార్య వర్ధంతి నేడు. భక్తులు ఆయనను మాస్టర్ ఇ.కె. అని పిలుస్తారు. ఆయన 1926 ఆగస్టు 11న ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆయన 100కు పైగా హోమియో క్లినిక్‌లను స్థాపించారు. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి 1971లో ‘వరల్డ్ టీచర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు. సాహితీలోకానికి ఆయన ఎన్నో అద్భుత రచనలు అందించారు.


