News February 5, 2025
ఆరోగ్య భద్రత కార్డులు పనిచేసేలా చూడండి: హరీశ్ రావు

ఈహెచ్ఎస్, పోలీస్ ఆరోగ్య భద్రత కార్డులు ఆసుపత్రుల్లో పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. 30ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు అందించిన ఠాగూర్ నారాయణ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డుతో చికిత్స వెళితే కార్డు చెల్లదని చెప్పడం శోచనీయమన్నారు.
Similar News
News February 9, 2025
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఫిబ్రవరి 09, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 9, 2025
నేటి నుంచి కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు

కుప్పం-బెంగళూరు మధ్య నేటి నుంచి యధావిధిగా రైళ్ల రాకపోకలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కుప్పం రైల్వే ట్రాక్ పనుల కారణంగా గడిచిన 15 రోజులుగా కుప్పం-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకల్లో అంతరాయం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కుప్పం ప్రాంతానికి చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఆదివారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
News February 9, 2025
హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.