News March 12, 2026

ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు: మంత్రి రాజనర్సింహ

image

మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘వుమెన్ వెల్నెస్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మహిళలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Similar News

News April 14, 2026

కీర దోసతో ఎన్ని లాభాలంటే..?

image

ఎండాకాలంలో చెమట రూపంలో కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పొందడానికి కీర దోస ఉపయోగపడుతుంది. అందులోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. నోటి దుర్వాసనను, శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కీర దోస చాలా మంచిది. రోజూ తినడం వల్ల టాక్సిన్స్‌ తొలగిపోతాయి.

News April 14, 2026

జనగామ: 94 మంది పంచాయతీ సెక్రటరీల బదిలీ

image

జనగామ జిల్లా వ్యాప్తంగా 94 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేస్తూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సెక్రటరీలు తమ కొత్త నియామక స్థానాల్లో 24 గంటల్లోపు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు. గ్రామ పరిపాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుపరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఒకేసారి ఇంత భారీగా బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

News April 14, 2026

మాస్టర్ ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి: శైలజా రామయ్యర్

image

కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి అంత్య పుష్కరాల పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరగాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాత్కాలిక పనులను 15 రోజుల ముందే పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులకు టెండర్లు పిలవాలని, పూర్తయిన వాటికి నిధులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఏర్పాట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.