News February 24, 2025
ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు

గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పెండింగ్‌లో పెట్టిన సుమారు రూ.1,770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం, సృజనాత్మకత ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోందని గవర్నర్ తెలిపారు.
Similar News
News February 25, 2025
విశాఖ నుంచి షాలిమార్‌కు వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు విశాఖ- షాలిమార్‌కు(08508/07) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలు మార్చి 11 నుంచి ఏప్రిల్ 29వరకు ప్రతి మంగళవారం నడవనుంది. మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం షాలిమార్ నుంచి బయలుదేరి గురువారం విశాఖ చేరుతుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 25, 2025
రామప్పకు మినీ హాఫ్ డే టూర్.. ఏసీ కోచ్‌లో జర్నీ

మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ – హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి రామప్ప ఆలయం వరకు 18 సీట్ల ఏసీ మినీ కోచ్ హాఫ్ డే టూర్లను నిర్వహిస్తున్నట్లు టీజీటీడీసీ డిప్యూటీ మేనేజర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.45 గంటల వరకు ఉంటుందన్నారు.
News February 25, 2025
కోల్‌కతా, భువనేశ్వర్ సమీపంలో భూకంపం

కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.