News February 15, 2025
ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కామారెడ్డి కలెక్టర్

రానున్న వేసవి దృష్ట్యా వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో ఆరోగ్య శాఖకు సంబంధించిన కర పత్రాలు, గోడ ప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తదితర అత్యవసర పరిస్థితుల్లో.. ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ.. వెంటనే స్పందించాలని ఆదేశించారు.
Similar News
News December 6, 2025
GDK నుంచి అరుణాచలం, రామేశ్వరానికి స్పెషల్ యాత్ర

GDK నుంచి రామేశ్వరానికి 7 రోజుల ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేశారు. ఈ యాత్ర డిసెంబర్ 15న GDK బస్టాండు నుంచి ప్రారంభమై DEC 21న తిరిగి చేరుకుంటుంది. యాత్రలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతాళశెంబు, మధురై, రామేశ్వరం, కాంచీపురం, జోగులాంబ లాంటి పుణ్యక్షేత్రాలను దర్చించుకోవచ్చని, ఒక్కరికి ఛార్జీ రూ.8,000గా ఉంటుందని డిపో DM నాగభూషణం తెలిపారు. టికెట్ల రిజర్వేషన్ కొరకు 7013504982 సంప్రదించవచ్చు.

HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.