News February 27, 2026
ఆరోగ్య సేవలపై ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి: కలెక్టర్

జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని వైద్యాధికారులకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. కలెక్టరేట్ నుంచి మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్‌సీ వైద్యులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతీ రోగికి సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.
Similar News
News April 14, 2026
బిహార్ కొత్త సీఎం.. తల్లిదండ్రుల నుంచి రాజకీయ వారసత్వం

బిహార్ కొత్త CMగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి 1968లో జన్మించారు. ఈయన తండ్రి శకుని చౌదరి 7 సార్లు MLA, ఓసారి MPగా గెలిచారు. తల్లి పార్వతి తారాపూర్ MLAగా పని చేశారు. 1990లో RJD నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత JDU, 2017లో BJPలో చేరారు. 2024 నుంచి Dy.CMగా ఉన్నారు. 2014-19, 2020-25 వరకు రెండుసార్లు MLCగా ఉన్నారు. కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఆ వర్గంలో మంచి పట్టుంది.
News April 14, 2026
NZB: వేసవి ఉపశమనం.. ఉపాధికి ఊతం

ఎండలు మండిపోతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత తీవ్రమైంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎయిర్ కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్‌లో కొత్త కూలర్ల విక్రయాలు జోరందుకున్నాయి. పాత కూలర్లను బాగు చేయించేందుకు జనం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఈ సీజన్ కారణంగా అటు విక్రయదారులు, ఇటు మరమ్మతుల ద్వారా మెకానిక్‌లకు చేతినిండా పని దొరుకుతూ ఉపాధి పొందుతున్నారు.
News April 14, 2026
భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.


