News February 27, 2026

ఆరోగ్య సేవలపై ప్రజా అభిప్రాయం మెరుగుపడాలి: కలెక్టర్

image

జిల్లాలో వైద్య శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని వైద్యాధికారులకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. కలెక్టరేట్‌ నుంచి మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్‌సీ వైద్యులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రతీ రోగికి సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.

Similar News

News April 20, 2026

పల్నాడు: అసభ్య ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

image

నాదెండ్ల (M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్‌దాస్ పంతులు అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తోటి కార్మికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నిందితుడిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి, పోక్సో కేసు నమోదు చేశారు.

News April 20, 2026

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

image

TG: రైతుభరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తోన్న కర్షకులకు శుభవార్త. నేడు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం భారీ బహిరంగ సభలో బటన్ నొక్కి ఫండ్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పైగా రైతులకు రూ.5,653 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గత నెల 23న తొలి విడత నిధులు ఇవ్వగా ఇప్పుడు రెండో ఎకరం వరకు నిధులు జమ కానున్నాయి.

News April 20, 2026

MNCL: చుక్క నీటి కోసం.. వందల గొంతుల పోరు!

image

భానుడి భగభగలకు భూగర్భం ఎండిపోయింది. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో జలకళ మాయమై.. జలకలత మొదలైంది. ఊరిలోని బావులన్నీ అడుగంటి, ‘ఈడిగేవాడ’లోని ఒక్కగానొక్క బావి ఇప్పుడు ఊరంతటికీ ప్రాణాధారమైంది. ​అగాధంలో ఉన్న కాస్తో కూస్తో జలాన్ని తోడేందుకు ఆ బావిలోకి వందలాది మోటారు పైపులు పాముల్లా వేలాడుతున్నాయి. నీటి చుక్క కోసం మోటార్లు పోటీపడుతుంటే.. బావి గర్భం హాహాకారాలు చేస్తోంది.