News June 4, 2024
ఆరోసారి గెలచిన నంద్యాల వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Similar News
News November 28, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో నిన్నటికి, ఈరోజుకు తేడా లేదు. వెండి స్వల్పంగా రూ.30లు పెరిగింది. ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము: రూ.12,590
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము: రూ.11,583
☛ వెండి 10 గ్రాములు: రూ.1680
News November 28, 2025
ప్రొద్దుటూరులో 10 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల 10 మంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. వడ్డించిన పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పును వడ్డించకుండా పక్కన పెట్టేశారు. కొద్దిసేపటికి ఆ 10 మందికి కడుపునొప్పి, వాంతులు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు ఆటోలో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 28, 2025
అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.


