News April 3, 2025
ఆరో స్థానంలో అనకాపల్లి జిల్లా: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష్యానికి మించి పని దినాలు కల్పించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం తెలిపారు. 120 లక్షల పది దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా 124.67 లక్షల పని దినాలను కల్పించామన్నారు. ఉపాధి కూలీలకు రూ. 350 కోట్లు వేతనాల రూపంలో చెల్లించామన్నారు. పని దినాల కల్పనలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News November 15, 2025
ఖమ్మం: కానిస్టేబుల్ సూసైడ్

ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (38) శుక్రవారం ఎదులాపురం సింహద్రినగర్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఆయన సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. గాయాల కారణంగా మనస్తాపం చెంది బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూరల్ సీఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 15, 2025
బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 15, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 40,026 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 34,160 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 40,026 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 7,698 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.


