News April 3, 2025
ఆరో స్థానంలో అనకాపల్లి జిల్లా: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష్యానికి మించి పని దినాలు కల్పించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం తెలిపారు. 120 లక్షల పది దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా 124.67 లక్షల పని దినాలను కల్పించామన్నారు. ఉపాధి కూలీలకు రూ. 350 కోట్లు వేతనాల రూపంలో చెల్లించామన్నారు. పని దినాల కల్పనలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందన్నారు.
Similar News
News April 19, 2025
వరంగల్ సీపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
News April 19, 2025
ADB: ఈ నెల 20న MJP బ్యాక్ లాగ్ సెట్

ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాల్లోని 6,7,8,9 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు RCO శ్రీధర్ తెలిపారు. ఎంజేపీ బ్యాక్‌లాగ్ సెట్ ఈ నెల 20న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,308 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని, గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News April 19, 2025
మట్టెవాడ: స్టెరాయిడ్ టాబ్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత స్టెరాయిడ్ టాబ్లెట్లను విక్రయిస్తున్న యువకుడిని మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పోలీసులు వివిధ రకాలైన స్టెరాయిడ్ టాబ్లెట్లు, టానిక్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా జిమ్ సెంటర్లలో టాబ్లెట్లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ హెచ్చరించారు.