News April 1, 2025

ఆర్అండ్‌బీ కార్యాలయం బోర్డులో అంబేడ్కర్ పేరు ఎక్కడ? 

image

కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చి చాలా రోజులు గడుస్తోంది. కానీ కొత్తపేట మండల రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బోర్డులో కోనసీమ జిల్లా అని మాత్రమే ఉంది. కోనసీమ జిల్లాకు ముందు అంబేడ్కర్ పేరు లేకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పేరు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Similar News

News November 23, 2025

అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

image

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్–ఓవర్‌లోడ్‌ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్‌ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.

News November 23, 2025

రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి?

image

భారత్‌లో రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి? అనే సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలిస్తున్నారు. టీ, బాయిల్డ్ ఎగ్, చిన్న సమోసా, సిగరెట్, లోకల్ ట్రైన్ టికెట్, చిప్స్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్, పెన్సిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ దృష్టిలో రూ.10కి కొనగలిగే బెస్ట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి.

News November 23, 2025

మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు

image

ప్రేమ, తృప్తి, త్యాగం, నిగ్రహం.. ఈ సత్కర్మలే మనిషిని జీవింపజేస్తాయి. మంచి మనిషి అనే పేరు తెస్తాయి. అసూయ, అత్యాశ, ద్వేషం, పగ వంటి దుష్కర్మలు మనిషిని దహింపజేస్తాయి. ఇవి ఉన్న మనిషి బతికున్న శవం వంటివాడు. అధికారం, అహంకారం, ఆనాలోచనలు జీవితానికి చెరుపు తెస్తాయి. అప్పు, యాచన ఎప్పుడూ చేయకూడదు. లక్ష్యం, సహనం, వినయం, విధేయత వంటి సద్గుణాలతో జీవించి, వ్యామోహం, స్వార్థం వదిలితేనే ఉత్తమ కర్మఫలాన్ని పొందుతాం.