News August 23, 2024

ఆర్ఓఆర్ 2024తో రైతులకు ఎంతో ఉపయోగకరం: గుత్తా

image

ప్రస్తుత 2020 రెవెన్యూ చట్టం వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి రైతులకు ఉపయోగకరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకుగాను ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ 2024 చట్టం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం NLG కలెక్టరేట్లో “తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు- 2024” ముసాయిదా పై ఏర్పాటు చేసిన సదస్సు, చర్చ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Similar News

News November 24, 2024

NLG: సర్పంచుల సంఘం జేఏసీ నాయకుల ముందస్తు అరెస్ట్

image

సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని HYDలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపి ప్రెస్ మీట్‌కి వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం JAC నాయకులు తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయనప్పటికీ, రూ.750 కోట్లు విడుదల చేశామని సీఎం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ సర్పంచులు ఉన్నారు.

News November 24, 2024

ఎస్సీ వర్గీకరణ బాధ్యత కాంగ్రెస్ పార్టీదే: మంత్రి రాజనర్సింహ

image

ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దేనని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అన్నారు. నల్గొండ ఆదివారం నిర్వహించిన మాదిగ, ఉప కులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణతో ఎవరి హక్కులు భంగం కలగదని, తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటాలు పంచుకోవడమే తప్ప మరొకటి కాదన్నారు.

News November 24, 2024

NLG: జిల్లాకు మరో 3 సమీకృత గురుకులాలు 

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో మొదటి విడతలో భాగంగా నల్గొండ, మునుగోడు, తుంగతుర్తి, HNR నియోజకవర్గాలకు మంజూరు చేసింది. రెండో విడతల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కోదాడ, నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను మంజూరు చేసింది.