News September 5, 2024
ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో గురువారం అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు.
Similar News
News November 4, 2025
వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News November 4, 2025
ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.
News November 4, 2025
నేషనల్ హైవే భూసేకరణపై సమీక్ష

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (ఎన్హెచ్ 163జీ) పనులకు సంబంధించి భూసేకరణ పురోగతిపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సమీక్షించారు. మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాల మీదుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 176.52 హెక్టార్లకు గాను 171.34 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పెండింగ్ అవార్డులను నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.


