News September 5, 2024
ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో గురువారం అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు.
Similar News
News September 21, 2024
క్యాబినెట్‌కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క
ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
News September 21, 2024
ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా
అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
News September 21, 2024
అక్టోబర్ 3 నుంచి 13 వరకు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
శ్రీ భద్రకాళి దేవస్థానంలో భద్రకాళి దేవి శరన్నవరాత్రి(దసరా) మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి తెలిపారు. అక్టోబర్ 12 విజయదశమి దసరా సందర్భంగా భద్రకాళి తటాకంలో హంస వాహన తెప్పోత్సవం, అక్టోబర్ 13 శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.