News April 25, 2024
ఆర్చరీలో మెరిసిన వెన్నం జ్యోతి సురేఖ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713923308581-normal-WIFI.webp)
విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో సత్తా చాటింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న పోటీలో మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ రెండో స్థానంలో నిలిచింది. సురేఖ, అదితి, పర్‌ణీత్‌లతో కూడిన భారత జట్టు(2118) టీమ్ విభాగం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు, మిక్స్‌డ్ టీమ్‌లో సురేఖ- అభిషేక్ (1419) జోడీ రెండో స్థానంలో నిలిచింది.
Similar News
News January 16, 2025
మానవత్వం చాటుకున్న మంత్రి కొలుసు పార్థసారధి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737040377828_60300469-normal-WIFI.webp)
మంత్రి కొలుసు పార్థసారధి మానవత్వం చాటుకున్నారు. గురువారం ఏలూరు నుంచి విజయవాడకు వెళుతుండగా జాతీయ రహదారిపై కలపరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడుకు చెందిన శిరీష, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని చూసి తన కాన్వాయిని ఆపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు.
News January 16, 2025
కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737038632706_51824121-normal-WIFI.webp)
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీపీఈడీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
News January 16, 2025
విజయవాడ: మెడికల్ విద్యార్థులకు గుడ్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737012945934_60300469-normal-WIFI.webp)
విజయవాడ ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో GNM సీట్లు పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీఎన్ఎం 30 సీట్లు ఉండగా వాటిని 60కి పెంచుతూ ఈ ఉత్తర్వులో పేర్కొంది. 30 నుంచి 60 మేరకు GNM సీట్లు పెంచుతూ వైద్యారోగ్య శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.