News March 5, 2025
ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్

బాసర ఆర్జీయూకేటీలో ఈసీఈ శాఖలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్ పద్మశ్రీకి డాక్టరేట్ అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యాపకురాలు డాక్టర్.పద్మశ్రీని అభినందించారు. ఆర్జీయూకేటీలో చాలామందికి డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని గోవర్ధన్ పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
NRPT: ప్రజావాణిలో 48 ఫిర్యాదులు: అదనపు కలెక్టర్

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
NRPT: ‘డయల్ యువర్ ఎస్పీ’కి విశేష స్పందన

ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఎస్పీ వినీత్ తెలిపారు. ప్రజలు నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదులు, సలహాలు అందించారని చెప్పారు. మొత్తం 17 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో ఎక్కువగా భూ తగాదాలు, రాత్రి పెట్రోలింగ్, ట్రాఫిక్ సమస్యలు, గంజాయి నిర్మూలనకు సంబంధించినవి ఉన్నట్లు ఆయన వివరించారు.
News November 3, 2025
₹1500 MO కేసు… 32 ఏళ్ల తర్వాత రిటైర్డ్ పోస్ట్మాస్టర్కి 3ఏళ్ల జైలు

మనీ ఆర్డర్ మోసం కేసులో నోయిడా కోర్టు తీర్పు చర్చనీయాంశమైంది. అరుణ్ 1993లో ₹1500 తండ్రికి MO చేశారు. సబ్పోస్టుమాస్టర్ మహేంద్ర కుమార్ కమీషన్తో కలిపి ₹1575కు నకిలీ రశీదు ఇచ్చి డబ్బును ప్రభుత్వానికి జమ చేయలేదు. సొమ్ము అందకపోవడంతో అరుణ్ ఫిర్యాదు చేయగా అధికారులు కేసుపెట్టారు. తప్పు అంగీకరించిన కుమార్ సొమ్మును తిరిగిచ్చేశాడు. విచారణ అనంతరం కోర్టు రిటైరైన అతడికి 3 ఏళ్ల జైలు, ₹10వేల జరిమానా విధించింది.


