News March 5, 2025
ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్

బాసర ఆర్జీయూకేటీలో ఈసీఈ శాఖలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్ పద్మశ్రీకి డాక్టరేట్ అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యాపకురాలు డాక్టర్.పద్మశ్రీని అభినందించారు. ఆర్జీయూకేటీలో చాలామందికి డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని గోవర్ధన్ పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 24, 2025
జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ

జాతీయస్థాయి పోటీల రిఫరీగా నిర్మల్ బిడ్డ రవీందర్ ఎంపికయ్యాడు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయి యోగా రిఫరీ డిప్లొమా పరీక్షలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా 130 మంది పాల్గొనగా భైంసా ఇలేగాం వాసి అయిన రవీందర్ పాల్గొని ఉత్తీర్ణత సాధించాడు. యోగా అసోసియేషన్ ఛైర్మన్ అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
News March 24, 2025
మార్చి 24: చరిత్రలో ఈరోజు

1603 : బ్రిటిషు మహారాణి ఎలిజబెత్ మరణం
1775 : కవి, వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులు జననం
1882 : క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్‌ను రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు
1977 : భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు (ఫొటోలో)
1984 : భారత హాకీ క్రీడాకారుడు ఆడ్రియన్ డిసౌజా జననం
1991: సినీ గేయ రచయిత చెరువు ఆంజనేయ శాస్త్రి మరణం
* ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం