News August 3, 2024

ఆర్టీపీపీలో క్రేన్ ఢీకొని కాంట్రాక్టు లేబర్ వ్యక్తి మృతి

image

ఎర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో శుక్రవారం సాయంత్రం క్రేన్ ఢీకొని, ముద్దనూరు చెందిన ఖాదర్ బాషా(49) అనే కాంట్రాక్ట్ లేబర్ తీవ్రంగా గాయపడి పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు శనివారం ఉదయం నుంచి ఆర్టీపీపీలో ఆందోళన చేస్తున్నారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

Similar News

News September 18, 2024

కడప: 19 నుంచి AP ఆన్లైన్ శాండ్ పోర్టల్ ప్రారంభం

image

ఈనెల 19 నుంచి ఏపీ ఆన్‌లైన్ శాండ్ పోర్టల్ అందరికీ అందుబాటులోకి రానుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభిస్తారని తెలిపారు. ఇసుక బుకింగ్ ప్రక్రియ, రవాణాదారుల జాబితా పొందుపరిచే ప్రక్రియ, బల్క్ వినియోగదారుల ఇసుక అవసరాన్ని ముందుగానే వెరిఫికేషన్‌ను భూగర్భ శాఖ ద్వారా జేసీ లాగింగ్‌కు పంపించాలని తెలిపారు.

News September 18, 2024

CM సహాయనిధికి YS సునీత రూ.10 లక్షల విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి మాజీ మంత్రి దివంగత YS వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రూ.10ల‌క్ష‌ల విరాళాన్ని అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌తో మంగళవారం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.

News September 18, 2024

వరద బాధితులకు బీ.టెక్ రవి సహాయం.. ఎంతంటే.!

image

విజయవాడ వరద బాధితులకు టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అండగా నిలిచారు. తన సొంత నిధులు రూ.6 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే పులివెందుల నాయకులు, కార్యకర్తల నుంచి మరో రూ.4 లక్షలు విరాళంగా వచ్చాయి. మొత్తం రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు బీటెక్ రవి అందజేశారు.