News July 6, 2024
ఆర్టీసీ బస్సులో డెలివరీ.. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన GHMC

HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్ను జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.
Similar News
News November 17, 2025
HYD: బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్

నగరంలో పెరుగుతున్న కాలనీలు, జనాభా, మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులు పెంచాలంటూ డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మొయినాబాద్ వంటి ప్రాంతాల వారు సరిపడ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.