News July 6, 2024

ఆర్టీసీ బస్సులో డెలివరీ.. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన GHMC

image

HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్‌‌‌‌‌ను‌ జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి‌ స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.

Similar News

News December 10, 2024

గోల్కొండ: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరణ

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. మణికొండలోని కార్యాలయంలో దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా స్వయంగా, ఆన్‌లైన్ ద్వారా అందజేయాలని ఆమె కోరారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్స్‌ను ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. 

News December 10, 2024

లష్కర్ జిల్లా సాధన కృషి: మాజీ పీసీసీ అధ్యక్షుడు

image

లష్కర్ జిల్లా సాధనకు త్వరలోనే ముఖ్యమంత్రితో సమావేశం అయినప్పుడు జిల్లా సాధన గురించి చర్చిస్తానని మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ MLA వీహెచ్ హనుమంతరావు అన్నారు. మంగళవారం లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుగు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆయనను అంబర్‌పేటలో కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.

News December 10, 2024

ఈ నెల శాసనసభ, మండలి సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం

image

జూబ్లిహిల్స్ MCRHRDలో డిసెంబర్ 11,12 తేదీలలో తెలంగాణ శాసనసభ, శాసన మండలి సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం ఉంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఓరియంటేషన్ ప్రోగ్రాంకి సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం వారు కలిసి పరిశీలించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ అవగాహన కార్యక్రమానికి తప్పని సరిగా హాజరుకావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.