News June 24, 2024

ఆర్టీసీ బస్సులో నగర మేయర్.. సైకిల్‌పై కమిషనర్

image

పర్యావరణహితంగా నడుచుకోవాలని సందేశాన్ని చాటుతూ నగర మేయర్ హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో, జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ సైకిల్ పై ఈరోజు విధులకు హాజరయ్యారు. ప్రతి సోమవారం జీవీఎంసీ కార్యాలయంలోకి వాహనాలను అనుమతించరు. వీలైనంతవరకు ఉద్యోగులు, ప్రజలు ప్రజారవాణా వినియోగించాలని, కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణహితంగా ఉండాలని ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు.

Similar News

News December 10, 2025

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

image

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News December 10, 2025

విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

image

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.

News December 10, 2025

14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

image

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.