News November 10, 2024
ఆర్టీసీ రాయలసీమ జోనల్ ఛైర్మన్‌గా పూల నాగరాజు
ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోనల్ ఛైర్మన్‌గా పూల నాగరాజును ప్రభుత్వం నియమించింది. రాయదుర్గానికి చెందిన పూల నాగరాజు గతంలో గుమ్మగట్ట మండల జెడ్పీటీసీ సభ్యులుగా, అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పని చేశారు. అలాగే టీడీపీ వాల్మీకి హక్కుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేశారు. టీడీపీలో సుదీర్ఘకాలం సేవలందించిన నాగరాజును ఆర్టీసీ జోనల్ ఛైర్మన్గా నియమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 8, 2024
యువతిపై కత్తితో దాడి.. మంత్రి సవిత సీరియస్
కడప జిల్లా వేములలో యువతిపై ఉన్మాది కత్తితో దాడి చేసిన ఘటనపై ఇన్‌ఛార్జి <<14821476>>మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం<<>> వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జి ఎస్పీ విద్యాసాగర్‌తో ఫోన్లో మాట్లాడి, తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత యువతికి మెరుగైన వైద్యమందించాలని తిరుపతి రుయా వైద్యులను మంత్రి సవిత సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనీ హామీ ఇచ్చారు.
News December 8, 2024
అనంతపురం పోలీసుల కస్టడీలో బోరుగడ్డ
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌పై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఓ కేసు విచారణలో భాగంగా నిన్న అనంతపురం పోలీసులు ఆయనను మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా అక్టోబర్ 17న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 8, 2024
ఆత్మకూరులో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్..కారణమిదే
ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ నరేశ్ శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పుల ఒత్తిడి అధికమై చనిపోయినట్లు తెలుస్తోంది. రూ. లక్షలలో అప్పుచేసి తండ్రి కొద్ది కాలం కిందట మృతిచెందగా.. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మరింత కుమిలిపోయిన అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.