News July 17, 2024
ఆర్డినెన్స్ అధికారులతో మెదక్ ఎంపీ సమీక్ష సమావేశం

సంగారెడ్డి జిల్లా ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగ భద్రత, కార్మిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చీఫ్ జనరల్ మేనేజర్ శివ శంకర్ ప్రసాద్, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) విజయ్ దత్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, బీఎంఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 26, 2025
చిన్నశంకరంపేట: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గవలపల్లి ఎక్స్ రోడ్డులోని వైన్స్ పర్మిట్ రూమ్ ఎదురుగా అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అంబాజీపేట గ్రామానికి చెందిన బండారు వెంకటేశం(40)గా గుర్తించారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చిన్న శంకరంపేట ఎస్సై నారాయణ చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News October 26, 2025
మెదక్: ‘పది రోజుల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి’

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్పై కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సమీక్షించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఆయన తహశీల్దార్లు, ఆర్డీఓలు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల తర్వాత దరఖాస్తులను తప్పకుండా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
News October 26, 2025
రామాయంపేట: GREAT.. 56వ సారి రక్తదానం

రామాయంపేట పట్టణానికి చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సొసైటీ ఛైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి 56వ సారి రక్తదానం చేశారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 56వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు చేతుల మీదుగా రక్తదాన పత్రాన్ని అందుకున్నారు. రాజశేఖర్ రెడ్డి సేవలను ఎస్పీ అభినందించారు.


