News February 6, 2025

ఆర్థికంగా బలోపేతం కావాలి: ASF కలెక్టర్

image

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లా మత్స్య శాఖ ద్వారా రాయితీతో మంజూరైన చేపల సంచార వాహనాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి పరిశీలించారు. ఈ పథకంలో క్యాంటీన్లు, మీ సేవ, పెరటి కోళ్ల పెంపకం, కోళ్ల ఫారంలకు అవకాశం కల్పించాలన్నారు.

Similar News

News February 25, 2026

ఫిల్మ్‌నగర్: సినిమా అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తన

image

సినిమాల్లో అవకాశాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. ఏపీకి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం నగరానికి రాగా, స్నేహితురాలి ద్వారా జీఎం రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లుక్ టెస్ట్, స్కిన్ టెస్ట్ పేరుతో కార్యాలయానికి పిలిపించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 25, 2026

ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

image

సంగారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్‌ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 25, 2026

నక్కపల్లి: ఈ తాజమహల్‌కు లిమ్కా బుక్‌లో చోటు

image

సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ మరో అరుదైన ఘనత సాధించారు. 2026 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు లభించింది. 4బీ పెన్సిల్ ముల్లుపై కేవలం 4 మి.మీ వెడల్పు, పొడవుతో అతి సూక్ష్మమైన తాజ్‌మహల్‌ను 6 గంటల పాటు శ్రమించి రూపొందించారు. నక్కపల్లి మండటం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్‌కు సంబంధించిన రికార్డు పత్రాన్ని మంగళవారం పోస్టల్ ద్వారా పంపారు.