News February 6, 2025
ఆర్థికంగా బలోపేతం కావాలి: ASF కలెక్టర్

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి పథకం కింద జిల్లా మత్స్య శాఖ ద్వారా రాయితీతో మంజూరైన చేపల సంచార వాహనాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి పరిశీలించారు. ఈ పథకంలో క్యాంటీన్లు, మీ సేవ, పెరటి కోళ్ల పెంపకం, కోళ్ల ఫారంలకు అవకాశం కల్పించాలన్నారు.
Similar News
News February 18, 2026
ప్రకృతి సేద్యం.. APCNF ప్రధాన ఉద్దేశం ఇదే

వ్యవసాయాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో, దీర్ఘకాలిక స్థిరత్వంతో సాగించే విధానంగా అభివృద్ధి చేయడమే APCNF లక్ష్యం. మొక్కకు కాదు, నేలకు ఆహారం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో ఇది ముందుకు సాగుతోంది. ఘన, ద్రవ జీవామృతం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్నాస్త్రం సహా ఇతర సహజ సూక్ష్మపోషకాలను పంటలకు అందిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో APCNF కీలకపాత్ర పోషిస్తోంది.
News February 18, 2026
JGL: కాంగ్రెస్ అధిష్ఠానంతో జీవన్‌రెడ్డి ‘తాడోపేడో’!

మాజీ మంత్రి జీవన్ రెడ్డి చాలా రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకొని అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై హైకమాండ్‌తో చర్చించడానికి ఆయన మంగళవారం ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ మార్పు లేదా కీలక పదవి లక్ష్యంగా తాడోపేడో తేల్చుకునేందుకు ఈ పర్యటన సాగుతోందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం బుజ్జగిస్తుందా లేక ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
News February 18, 2026
టెన్త్ పరీక్షల గ్యాప్‌లోనూ క్లాసులు!

TG: టెన్త్ పరీక్షల మధ్య గ్యాప్‌లో విద్యార్థులకు క్లాసులు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్స్ మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండటంతో సూడెంట్లు స్కూలుకు రావాలని ఆదేశించారు. ఆయా రోజుల్లో 3 పీరియడ్ల చొప్పున క్లాసులు తీసుకోనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు జరగనుండగా, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. ఆ గ్యాప్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.


