News May 23, 2024
ఆర్థిక ఇబ్బందుల్లో సాలూరు లారీ పరిశ్రమ

రాష్ట్రంలో విజయవాడ తరువాత జిల్లాలో సాలూరు లారీ పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 2300 వరకు లారీలు ఉన్నాయి. ఈ మోటారు పరిశ్రమపై 18 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగాను ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతమందికి జీవనాధారమైన ఈ పరిశ్రమ పెరిగిన ఆయిల్, విడిభాగాలు ధరలకు అనుగుణంగా కిరాయిలు పెరగకపోవడంతో బాటు లోడింగ్ లేక అధిక మొత్తం లారీలు యార్డ్లోనే ఉంటున్నాయి. దీనివలన చాలా కుటుంబాల వారు రోడ్డున పడ్డారు.
Similar News
News November 14, 2025
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.
News November 14, 2025
VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 14, 2025
ప్రకృతి వ్యవసాయం లాభదాయకం: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి, పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. స్థానిక యూత్ క్లబ్లో నిర్వహించిన రిసోర్స్ పర్సన్ శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం పెరగడంతో భూమి సారం తగ్గిపోగా, అవశేషాలు ఆహారం ద్వారా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సహజ ఎరువులు భూమి సారాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.


