News October 4, 2024

ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఆర్థిక మోసలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దౌత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనపు కలెక్టర్ దాసరి వేణు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఏజీఎం రాధికభరత్ లతో కలిసి ఆర్థిక మోసాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు ఓటిపిలు ఎవరికి చెప్పవద్దని, అపరిచిత ఫోన్, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News September 19, 2025

ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు పదోన్నతి

image

రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌కు సైతం పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. తిరిగి యధా స్థానంలో అదనపు ఎస్పీగా కొనసాగనున్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News September 19, 2025

క్రికెట్ ఆడిన ఆదిలాబాద్ SP

image

జిల్లా స్థాయిలో పోలీసులకు క్రికెట్ టోర్నమెంట్ పూర్తయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నాలుగు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్‌‌ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించారు. చివరి రోజు ముగింపు కార్యక్రమ సందర్భంగా గెలుపొందిన సూపర్ స్ట్రైకర్స్ బృందానికి మొదటి బహుమతి, రన్నరప్‌గా నిలిచిన ఆదిలాబాద్ రాయల్స్ బృందానికి 2వ బహుమతిని అందజేశారు.

News September 19, 2025

తలమడుగు: కలప అక్రమ రవాణా

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాపూర్ సమీపంలోని MS గార్డెన్‌లో సిబ్బంది తనిఖీలు చేశారు. రూ.84 వేల విలువైన టేకు కలప దొరికినట్లు చెప్పారు. కలపను జప్తు చేసి యజమాని మొహమ్మద్ మూసా, లక్షణ్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.