News June 19, 2024
ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్
విజయవాడ సచివాలయంలో బుధవారం శాసన సభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి వచ్చిన మంత్రికి సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 10, 2024
వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.
News September 10, 2024
అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు
అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
News September 10, 2024
తాడిపత్రిలో అగ్నిప్రమాదం
తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.