News February 22, 2025
ఆర్మీ జవాన్‌పై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు: SI

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామంలో ఆర్మీ జవాన్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిరణ్ శుక్రవారం తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోశెట్టి, భూమేష్ గురువారం రాత్రి గొల్లమాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భోజరాజుపై దాడి చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 22, 2025
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నిందితుల అరెస్ట్

హిందూపురం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులు మంజుల, కానిస్టేబుల్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. టూటౌన్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సహకారంతో మోడల్ కాలనీలో మంజుల వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈశ్వర్ అనే వ్యక్తి పారిపోయాడు. మంజుల, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News March 22, 2025
NRPT: ట్రైనీ కలెక్టర్‌కు ఘన సత్కారం

గతేడాది ఏప్రిల్‌లో శిక్షణ కోసం నారాయణపేట జిల్లాకు వచ్చి తిరిగి వెళ్తున్న ట్రైనీ కలెక్టర్ గరిమా నరులకు శుక్రవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పూలమాల, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో అనుభవాలను గరీమా గుర్తు చేసుకున్నారు. నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేశారని కలెక్టర్ సూచించారు.
News March 22, 2025
బయట తినాలంటేనే భయమేస్తోంది

TG: ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఫుడ్ లవర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తోన్న దాడుల్లో కుళ్లిన మాంసం లభించగా, కిచెన్ శుభ్రంగా లేదని, కూరగాయలు సరిగ్గా నిల్వ చేయట్లేదని సోదాల్లో తేల్చారు. దీంతో ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.