News April 11, 2025

ఆర్మీ మేజర్‌గా మంచిర్యాల బిడ్డ మీనాక్షి గ్రేస్

image

మేజర్ పదోన్నతి పొందిన మీనాక్షి గ్రేస్‌ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ భారత సైన్యంలో కెప్టెన్ నుంచి మేజర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమె స్వగృహానికి వచ్చారు. నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. దేశ సేవకు చేసిన కృషి ప్రతి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు.

Similar News

News February 23, 2026

పరీక్షల తర్వాతే ఎన్నికలు?

image

TG: MPTC, ZPTC ఎన్నికలు ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగమంతా ఆయా పనుల్లోనే బిజీగా ఉండనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

News February 23, 2026

ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

image

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.

News February 23, 2026

IDFC ఫస్ట్ బ్యాంక్‌లో ₹590 కోట్ల స్కామ్!

image

చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో ₹590 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది. హరియాణా ప్రభుత్వ విభాగాలకు చెందిన అకౌంట్లలో ఈ గోల్‌మాల్ జరిగింది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్‌లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హరియాణా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని, సాధారణ కస్టమర్ల సొమ్ము సేఫ్ అని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది.