News June 30, 2024

ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో జిల్లా వాసి మృతి

image

ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో జిల్లావాసి మృతి చెందారు. రాచర్ల మండలం కాలవపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి మిలిటరీలో పనిచేస్తున్నారు. నీటిలో ఆర్మీ విన్యాసాలు చేస్తుండగా మొత్తం ఐదుగురు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 12, 2024

కంభం: వీరుడికి కన్నీటితో సెల్యూట్

image

జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన సుబ్బయ్య (45)కు నార్పలలో అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. పోలీసులు, బంధువులు, ప్రజల అశ్రునయనాల మధ్య వారి సొంత వ్యవసాయ పొలంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి జాతీయ జెండాను జవాన్ సతీమణికి అందించారు. కన్నీటిని దిగమింగుతూ సుబ్బయ్య భార్య, కుమారుడు, కుమార్తె భౌతికకాయానికి సెల్యూట్ చేశారు.

News December 12, 2024

సింగరాయకొండ: 800 మందిని మోసం చేసిన కి‘లేడీ’

image

మండలంలోని ఉలవపాడుకు చెందిన కామంచి కోటి అనే వ్యక్తి నందిని పొదుపు సంస్థను ప్రారంభించారు. ఈ పొదుపు సంఘాల్లో సింగరాయకొండకు చెందిన పలువురిని చేర్చుకొని 800 మంది చేత రూ.50 లక్షల వరకు కట్టించాడు. కోటి మరణించగా.. అతని భార్య నందిని పొదుపు సంస్థను నడుపుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా సంస్థను మూసివేయడంతో డబ్బులు కట్టిన వారు మోసపోయామని గ్రహించి న్యాయం కోసం సింగరాయకొండ ఎస్సై మహేంద్ర వద్దకు చేరారు.

News December 12, 2024

ప్రకాశం: విదేశాలకు వెళ్లి.. కష్టాలను తీరుస్తాడనుకుంటే!

image

‘మా వాడు బాగా చదివాడు.. విదేశాల్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు’ అని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంటికి వచ్చి తమను సంతోషంగా చూస్తాడనుకొని ఆనందపడ్డారు. కానీ.. ఓ <<14850503>>రోడ్డు ప్రమాదం<<>> వారి ఆశలను రోడ్డు పాలు చేసింది. ఈ ఘటన చీమకుర్తి బూదవాడలో చోటు చేసుకుంది. బుధవారం చిరంజీవి(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతడితో ప్రయాణించిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ కుటుంబాన్ని శోకసంద్రాన్ని మిగిల్చింది.