News July 14, 2024

ఆర్మూర్: ఆస్తి వివాదంలో అన్న ప్రాణం తీసిన తమ్ముడు

image

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాల్లో అన్న ప్రాణం తీసిన ఘటన ఆర్మూర్ మండలంలో జరిగింది. మామిడిపల్లికి చెందిన నర్సయ్య, గంగాధర్ అన్నదమ్ములు వీరి మధ్య శుక్రవారం ప్లాట్ల విషయంలో గొడవ జరగగా ఆగ్రహంతో గంగాధర్ నర్సయ్యపై కర్రతో దాడి చేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్సయ్య శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News October 29, 2025

నిజామాబాద్: NOV 1వరకు గడువు: కలెక్టర్

image

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్- 2047 అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తుందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని బుధవారం ఆయన ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనేందుకు NOV 1వరకు గడువుందని చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ నిర్మాణంలో తమవంతు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News October 29, 2025

NZB: పతకాలు గుర్తింపు కాదు.. నిబద్ధతకు ప్రతీక CP

image

పతకాలు సిబ్బందికి గుర్తింపు మాత్రమే కాదని, వారి సేవా స్ఫూర్తికి, కష్టపడి పని చేసే నిబద్ధతకు ప్రతీక అని నిజామాబాద్ CP సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 95 మందికి వచ్చిన వివిధ రకాల సేవా పతకాలను మంగళవారం ఆయన సీపీ కార్యాలయంలో ప్రదానం చేసి మాట్లాడారు. ప్రజల, శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది చూపుతున్న సేవా మనోభావం ప్రశంసనీయమైనదని ప్రశంసించారు.

News October 29, 2025

బోధన్, ఆర్మూర్ పట్టణాలకు మాస్టర్ ప్లాన్

image

అమృత్ 2.0లో భాగంగా జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మొదటి కన్సల్టేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగుపరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని కలెక్టర్ వెల్లడించారు. అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.