News January 5, 2025
ఆర్మూర్: కోడి పందెల స్థావరంపై పోలీసుల దాడి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం దూదేకుల కాలనీలో కోడి పందెలు నిర్వహిస్తున్న 13 మందిని పట్టుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వారి నుంచి కోడి కత్తులు, రూ.7,380 నగదు, 11 సెల్ ఫోన్లు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News January 20, 2025
NZB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే!
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకునే వారి వివరాలు ఇవే. HM కేటగిరీలో బాలచంద్రం(రాకాసిపేట్), శ్రీనివాస్ (పెర్కిట్), SAల్లో కృష్ణారెడ్డి (గూపన్పల్లి), అరుణశ్రీ(కంజర), ఆరోగ్యరాజ్ (గుండారం), సతీశ్ కుమార్ వ్యాస్(బినోల), గోవర్ధన్ (మామిడిపల్లి), హన్మంత్ రెడ్డి (జానకంపేట్), SGTల్లో శ్రీనివాస్(వేంపల్లి), రాధాకృష్ణ (నర్సాపూర్), సాయిలు (కొత్తపల్లి) ఉన్నారు.
News January 20, 2025
NZB: నేడు జిల్లా స్థాయి అవార్డుల పంపిణీ: DEO
నిజామాబాద్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అశోక్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న న్యూ అంబేడ్కర్ భవన్‌లో ఈ అవార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ఈ పంపిణీ గత సెప్టెంబర్‌లో జరపాల్సి ఉండగా వరదల కారణంగా వాయిదా పడిందన్నారు.
News January 20, 2025
NZB: 28 కేంద్రాలు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్నాయి: DGP
రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలు భరోసా కేంద్రాలు లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సేవలందిస్తున్నాయని DGP జితేందర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌లో 29వ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాగా 2016 నుంచి 2024 డిసెంబర్ వరకు భరోసా కేంద్రాల ద్వారా పోక్సో వంటి కేసులు 6910, రేప్ కేసులు 1770, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ అదర్స్ 11,663 కేసులు పరిష్కరించడం జరిగిందని వివరించారు.