News March 12, 2025
ఆర్మూర్: గ్రూప్స్ ఫలితాలలో సత్తా చాటిన పెర్కిట్ వాసి

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన రామ్ కిషోర్ గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో గ్రూప్-2 ఫలితాలలో 136వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.
Similar News
News October 15, 2025
TU: డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు తేదీని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.కే.సంపత్ కుమార్ మంగళవారం ప్రకటించారు. B.A/B.Com/BSC/BBA/BCA I, III, Vవ సెమిస్టర్(రెగ్యులర్), II,IV,VI సెమిస్టర్ (బ్యాక్లాగ్ 2021-2024) విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.100తో ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉందన్నారు.
News October 15, 2025
NZB: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి చర్యలు

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYD నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు.
News October 14, 2025
నిజామాబాద్: రైతుల బాగోగులు ప్రభుత్వానికి అవసరం లేదు: బీజేపీ

రైతుల బాగోగుల గురించి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మండిపడ్డారు. 80 లక్షల టన్నుల పంటను కొనడానికి సిద్ధం అని బీరాలు పలికి, కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించారన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభాన్ని తాత్సారం చేస్తున్నారు. రైతులకు మరింత నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు.