News February 13, 2026
ఆర్మూర్: ప్రకటనలకే పరిమితం.. నిధుల్లేక రైతుల్లో ఆందోళన

కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ కేఆర్. సురేశ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వ్యవసాయ రంగానికి బోర్డులు ప్రకటిస్తూనే బడ్జెట్‌లో నిధులు కేటాయించడం లేదన్నారు. బిహార్ మఖానా బోర్డుకు రూ.100 కోట్లు ప్రకటించి ఖర్చు చేయలేదని, నిజామాబాద్ పసుపు బోర్డుకు కేటాయింపులు లేకపోవడం ఉదాహరణలని పేర్కొన్నారు. ఇలా స్పష్టమైన నిధులు లేకపోతే రైతుల్లో విశ్వాసం తగ్గుతుందన్నారు.
Similar News
News March 16, 2026
NZB: ఇంటర్ అమ్మాయిలకు అద్భుత అవకాశం

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని 71 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
News March 16, 2026
నిజామాబాద్: తస్మాత్ జాగ్రత్త : సీపీ

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.