News January 25, 2025
ఆర్మూర్ : ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. B.Ped, M.Ped చేసిన వారికి అనుభవాన్ని బట్టి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 27న సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ, డెమో ఉంటుందన్నారు.
Similar News
News September 18, 2025
కమ్మర్పల్లి: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో మరణించారు. ఈ ఘటన కమ్మర్పల్లిలోని గాంధీనగర్లో జరిగింది. మృతులు కొండపల్లి లక్ష్మణ్(39), చిత్తారి నర్సు(30)గా పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారి 63 పక్కన ఉన్న చౌటా మోటా కాలువలో చేపలు పడుతుండగా, 11KV హై టెన్షన్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. లక్ష్మణ్ భార్య సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
News September 17, 2025
NZB: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది’

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి అన్నారు. NZBలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.
News September 17, 2025
NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.