News January 28, 2025
ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్

ఆర్మూర్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఆయనను మున్సిపల్ కమిషనర్ రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News October 31, 2025
నిజామాబాద్‌లో పోలీస్‌ల కొవ్వొత్తుల ర్యాలీ

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్ట్ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేవని కొనియాడారు. వారి వల్లే సమాజంలో శాంతి నెలకొందన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు.
News October 31, 2025
బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.
News October 31, 2025
NZB: కల్వల మత్తడి మరమ్మతులు వెంటనే చేపట్టాలి: కవిత

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోందన్నారు. మరమ్మతులకు గత ప్రభుత్వమే రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.


