News February 10, 2025

ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.

Similar News

News April 17, 2026

TU: వార్షికోత్సవ పనులను వేగవంతం చేయాలి: వీసీ

image

ఈనెల 22న నిర్వహించనున్న యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలని టీయూ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం వార్షికోత్సవ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని సూచించారు. ఇంజినీరింగ్, ఆర్ట్స్ కళాశాలల ప్రిన్సిపల్ ఆరతి, రాంబాబు పాల్గొన్నారు.

News April 17, 2026

LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

image

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.

News April 17, 2026

NZB: ఎన్‌ఎస్‌సీ&ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ ర్యాలీ

image

నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్ 18 ఉదయం 7 గంటలకు పోలీస్ కమిషనరేట్ & నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌సీ, ఎన్‌పీఎల్-2026 స్పోర్ట్స్ మీట్ ర్యాలీ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ఈ ర్యాలీ చేపట్టనున్నారు.