News December 1, 2024

ఆర్మూర్: వ్యవసాయ పనులకు వెళ్తూ మృత్యువాత

image

వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన ఇది. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 16, 2025

NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.

News December 16, 2025

3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

News December 16, 2025

NZB: తుది దశలో మహిళా ఓటర్లే కీలకం

image

NZB జిల్లాలో తుది దశలో జరిగే కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జయాపజయాలు ప్రభావితం చేసేది మహిళా ఓటర్లే. మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు.