News December 1, 2024
ఆర్మూర్: వ్యవసాయ పనులకు వెళ్తూ మృత్యువాత

వ్యవసాయ పనులకు వెళ్తూ ఓ రైతు మృత్యువాత పడిన విషాద ఘటన ఇది. పెర్కిట్‌కు చెందిన శ్రీరాం అశోక్ (55) ఆదివారం ఉదయం వ్యవసాయ పనుల కోసం బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం జాతీయ రహదారిపై రిలయన్స్ పెట్రోల్ పంప్ సమీపంలో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 16, 2026
నిజామాబాద్‌లో కొండెక్కిన ధరలు

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.
News January 16, 2026
నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.