News June 12, 2024
ఆర్మూర్: హత్య కేసులో యావజ్జీవ శిక్ష

ఇద్దరిని హత్య చేసిన కేసులో శ్రీనివాస్‌కు యావజ్జీవ శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలిలా.. వేల్పూర్‌కి చెందిన అనిల్‌కి ఆర్మూర్(M)మామిడిపల్లి వాసి శ్రీనివాస్ పరిచయమయ్యాడు. ఈక్రమంలో అనిల్ దగ్గర శ్రీనివాస్ రూ.500 అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. 2021 NOVలో ఇద్దరికి గొడవ జరగగా శ్రీనివాస్ అనిల్, తన తల్లి రాజుబాయిని గొడ్డలితో నరికి పారిపోయాడు.
Similar News
News March 21, 2025
NZB: చోరీకి పాల్పడిన మహిళలకు దేహశుద్ధి

ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఠాణాకలాన్‌లో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన గిర్మారెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం NZBలో నివాసముంటున్నాడు. గత 9 నెలలుగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించిన బెంగి గంగామణి, ఎరుకల శ్యామల, సునీతలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో చోరి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
News March 21, 2025
నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్

నిజమాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. శుక్రవారం కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం లభించినపట్టికీ పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
News March 21, 2025
NZB: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఇప్పటికే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెల 22న మొదటి దశ (ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్), 24 నుంచి రెండో దశ (ఫిజిక్స్, ఎకనామిక్స్), 26 నుంచి మూడో స్పెల్ (కెమిస్ట్రీ, కామర్స్), 28వ తేదీ నుంచి నాలుగో స్పెల్ (హిస్టరీ, బోటనీ, జువాలజీ) మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు.