News January 10, 2025

ఆర్మూర్: హత్య కేసు UPDATE.. ముగ్గురు కొట్టడంతోనే మృతి

image

ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాత్రి సమయంలో కనపర్తి రాజు, కనపర్తి సత్యనారాయణ, బడే రవి లు డబ్బుల విషయంలో మృతుడు మైలారపు సోమేశ్@ సాయిలు (60) గొడవపడి, బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల మృతి చెందినట్లు తేలిందని ఆర్మూర్ సీఐ తెలిపారు.

Similar News

News November 26, 2025

నిజామాబాద్‌లో ఈ గ్రామాలు మహిళలవే..!

image

NZB జిల్లాలోని 545 GPల సర్పంచ్, 5022 వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ క్రమంలో 545 GPల్లో మహిళలకు 244 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇందులో STలకు 41, SCలకు 35, BCలకు 55, జనరల్ స్థానాల్లో 113 స్థానాలు కేటాయించారు. వార్డు మెంబర్లుగా 2,152 సీట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

నిజామాబాద్: ‘లోకల్ దంగల్’.. తగ్గేదే లే!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో NZB జిల్లాలోని 545 గ్రామాల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తగ్గేదేలే అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ ఉండబోతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో BJP, CPM, CPIతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ల ప్రభావం కూడా ఉండబోతోందని అంటున్నారు.